తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటి కాకముందు పాయల్ పార్ట్​టైమ్ ఉద్యోగం - పాయల్ రాజ్​పుత్

నటి కాకముందు, పార్ట్​టైమ్ ఉద్యోగం చేశానని చెప్పింది హీరోయిన్ పాయల్ రాజ్​పుత్. ట్యూషన్​ చెబుతూ నెలకు రూ.5 వేలు రూపాయలు సంపాదించే దానినని తెలిపింది.

నటి కాకముందు పాయల్ పార్ట్​టైమ్ ఉద్యోగం
హీరోయిన్ పాయల్ రాజ్​పుత్

By

Published : Dec 17, 2019, 7:10 AM IST

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలని కోరిక ఉన్నంత మాత్రాన అవకాశం వెంటనే రాదు. తమ నటనను ప్రదర్శించేందుకు కొంతకాలం వేచి చూడక తప్పదు. ఆ ఛాన్స్​ అందుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆర్థికంగానూ సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని అధిగమించి పోరాడితేనే వెండితెరపై వెలుగుతారు. అయితే తాను పడిన కష్టాల గురించి ఓ సందర్భంలో చెప్పింది హీరోయిన్ పాయల్ రాజ్​పుత్.

హీరోయిన్ పాయల్ రాజ్​పుత్

పాయల్‌.. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు వాళ్ల అమ్మ ఖర్చులకు రూ.5 వేలు ఇచ్చేదట. ఆ సమయంలో అది పెద్ద మొత్తమే అయినా.. సినిమాల్లో అవకాశాల కోసం ముంబయి వెళ్లాలంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కనీసం లక్ష ఉండాలనే ఆలోచనతో పార్ట్‌ టైం జాబ్‌ చేసేదట. అలా ట్యూషన్స్‌ చెప్పి, నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు సంపాదించేదట. అనుకున్నట్టుగానే ముంబయి వెళ్లే సమయంలో రూ.లక్ష.. తన బ్యాంక్​ ఖాతాలో ఉన్నాయని చెప్పింది.

ఇది చదవండి: పోర్న్​ స్టార్ అన్నారు.. రాత్రంతా ఏడ్చా: పాయల్

ABOUT THE AUTHOR

...view details