'ఆర్‌ఎక్స్ 100' చిత్రంలో తన అందాలతో కనువిందు చేసింది పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వరుస అవకాశాలు అందుకుంటూ కుర్రకారు మతులు పోగుడుతున్న ఈ భామ ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. మరి పాయల్‌ను చేసుకునే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఏంటో చూద్దామా.
అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: పాయల్ - అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: పాయల్
ప్రేమ పెళ్లే చేసుకుంటానని చెబుతోంది నటి పాయల్ రాజ్‌పుత్. తను వివాహమాడే వాడు ఎలా ఉండాలో వివరించింది. మరి ఆ అర్హతలేంటో చూసేయండి.
తనని వివాహమాడే వాడు అందంగా ఉండాలట. ఎంత ఎత్తైనా ఫర్వాలేదు, తనకి తగ్గట్లు ఉంటే చాలంటుంది. ముఖ్యంగా హాస్య చతురత కలిగి ఉండాలట. ఎప్పుడైనా మనస్పర్థలు వస్తే చిన్న పిల్లలా బుజ్జగించాలట. అంతేకాదు చేసుకుంటే ప్రేమ పెళ్లే అని గట్టిగా చెబుతోంది. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోనని వివరించింది.
అయితే ఇటీవలే తన స్నేహితుడు సౌరభ్ డింగ్రా పుట్టిన రోజు సందర్భంగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది పాయల్. అతడినే చేసుకుంటుందేమో అంటూ చర్చలు మొదలు పెట్టారు నెటిజన్లు.