ఆర్ఎక్స్ 100తో ప్రేక్షకులను తన అందాలతో ఫిదా చేసిన ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. ఆర్డీఎక్స్ లవ్ చిత్రంతో మరోసారి కుర్రకారుకు గిలిగింతలు పెట్టేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే ఈ విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ ప్రచార చిత్రానికి నెటిజన్లు పెట్టిన కామెంట్లు చూసి రాత్రంతా ఏడుస్తూనే ఉందట పాయల్.
"ఆర్డీఎక్స్ లవ్’ టీజర్ విడుదలయ్యాక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్నీ దారుణమైన కామెంట్లే ఉన్నాయి. ఒకరు నన్ను పోర్న్ స్టార్ అని కామెంట్ చేస్తే.. మరొకరు సిల్క్‌స్మితలా రెచ్చిపోతున్నావంటూ వ్యాఖ్యానించారు. మరికొన్నయితే చెప్పలేని విధంగా ఉన్నాయి. అవి చూసి రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా. నేను అంత పెద్ద తప్పు ఏం చేశానా అనిపించింది" - పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్
మహిళలు చర్చించడానికి కూడా ఇష్టపడని సేఫ్టీ, పీరియడ్స్ వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించామని చెప్పింది పాయల్.