తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బయోపిక్​లపై ఆసక్తి లేదు: పాయల్ ​రాజ్​పుత్​ - biopic

ఆర్ఎక్స్100 ఫేమ్ పాయల్ రాజ్​పుత్​కు బయోపిక్​లో నటించడం ఇష్టముండదంట. తన జీవిత కథలో ఇంకొకరు నటించాలని, అంతే కానీ వేరొకరి పాత్రను పోషించాలన్న ఆసక్తి తనకు లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది పాయల్.

పాయల్ రాజ్​పుత్​

By

Published : Sep 14, 2019, 5:16 AM IST

Updated : Sep 30, 2019, 1:14 PM IST

ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్​ నడుస్తోంది. ఇప్పటికే మేరికోమ్, మహానటి, మణికర్ణిక లాంటి నిజ జీవితగాథలతో మన హీరోయిన్లు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే టాలీవుడ్ హాట్ బాంబ్ పాయల్ రాజ్​పుత్​కు మాత్రం బయోపిక్​ల్లో నటించడం అంటే అస్సలు ఇష్టం ఉండదంట.. ఈ విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

"ఎవరైనా నా జీవితకథను పోషించేలా ఉండాలని అనుకుంటా. అంతేకానీ మరొకరి బయోపిక్‌లో నటించాలన్న ఆసక్తి నాకు లేదు. భవిష్యత్తులో నా కెరీర్​లో నేను ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటేనే నా జీవిత కథలో ఇంకొకరు నటించడం సాధ్యమవుతుంది" -పాయల్ రాజ్​పుత్​, టాలీవుడ్ హీరోయిన్.

త్వరలో ఆర్​డీఎక్స్​లవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది పాయల్. అంతేకాకుండా వెంకటేష్, నాగచైత్యన కలిసి నటిస్తున్న వెంకీమామ లోనూ పాయలే హీరోయిన్. రవితేజ పక్కన డిస్కోరాజాలోనూ అవకాశం దక్కించుకుందీ ఆర్​ఎక్స్ 100 భామ.

ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా షురూ..!

Last Updated : Sep 30, 2019, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details