పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'(bheemla nayak release date) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా 2022 జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే అదే సమయానికి ప్రభాస్ 'రాధేశ్యామ్', రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' కూడా విడుదల కానున్నాయి. దీంతో భీమ్లానాయక్ విడుదల తేదీ వాయిదా వేస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. జనవరి 12న రిలీజ్ అవ్వడం పక్కా అని ట్వీట్ చేశారు. 'గుర్తుపెట్టుకోండి.. ఈ సారి కుడా మిస్ అవ్వదు త్వరలోనే థియేటర్లలో కలుద్దాం' అని రాసుకొచ్చారు. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.
థియేటర్లలోనే
కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన చిత్రాల్లో 'గమనం'(gamanam shriya saran) ఒకటి. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటం వల్ల త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీని ఖరారు చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను పంచుకుంది. 'గమనం డిసెంబరు 10న.. కేవలం థియేటర్లలోనే' అని పేర్కొంది. ఈ సినిమాలో శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, నిత్యామేనన్ ప్రధాన పాత్రలు పోషించారు. పలు ఉపకథల సమ్మేళనంగా సుజనా రావు తెరకెక్కించారు. రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించారు. ఇళయరాజా స్వరాలందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది.
రిలీజ్ డేట్
అజయ్ దేవ్‌గణ్-సిద్ధార్థ్ మల్హోత్రా-రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన సినిమా 'థ్యాంక్ గాడ్'(rakul preet singh thank god). ఈ సినిమాను 2022 జులై 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ మూవీకి ఇంద్రకుమార్ దర్శకుడు.