పవన్ కల్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ఏప్రిల్ 9న విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా స్పందిస్తూ..."సినిమాపై వస్తున్న వార్తలు పక్కన పెట్టండి. 'వకీల్‌సాబ్'ను థియేటర్లలో మాత్రమే చూడండి" అంటూ వెల్లడించింది. 'దయ చేసి పుకార్లు నమ్మొద్దు. బిగ్‌స్క్రీన్‌పై వకీల్‌సాబ్ చూడండి. ప్రస్తుతానికి ఏ ఓటీటీలోనూ సినిమాను విడుదల చేసే ఆలోచనే లేదు" అని చిత్ర బృందం ప్రకటించింది.
ఓటీటీలో 'వకీల్‌సాబ్'- స్పష్టతనిచ్చిన చిత్ర బృందం - వకీల్‌సాబ్ ఓటీటీ
పవన్‌కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' చితాన్ని.. ప్రస్తుతానికి ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలేదని స్పష్టం చేసింది చిత్రబృందం. ఈ సినిమాను థియేటర్లో మాత్రమే చూడాలని విజ్ఞప్తి చేసింది.
వకీల్‌సాబ్
హిందీలో వచ్చిన 'పింక్' చిత్రానికి ఇది రీమేక్. అయితే కథలో కొన్ని మార్పులు చేసి 'వకీల్ సాబ్'ను తెరకెక్కించారు. ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. హిందీ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు.
ఇదీ చూడండి:'వకీల్‌సాబ్'పై మెగా హీరోల ప్రశంసలు