తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమెరికాలోనూ 'వకీల్​సాబ్'​ వసూళ్ల హవా! - వకీల్​సాబ్​ పవన్​కల్యాణ్​

అమెరికాలోనూ పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్'​ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా 7,10,952 డాలర్లను వసూలు చేసింది.

vakeelsaab
వకీల్​సాబ్​

By

Published : Apr 15, 2021, 10:37 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు విదేశాల్లోనూ అభిమానులు ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అమెరికాలోనూ 'వకీల్‌సాబ్‌' హవా నడుస్తోంది. ఆయన ప్రధానపాత్రలో నటించిన 'వకీల్‌సాబ్‌'ను డైరెక్టర్‌ వేణుశ్రీరామ్‌ తెరకెక్కించారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 117 ప్రాంతాల్లో 8,311 డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 7,10,952 డాలర్లు రాబట్టింది.

ఈ సినిమాలో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేసింది. నివేదాథామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం ఇచ్చారు.

ఇదీ చూడండి: 'మగువా మగువా' ఫిమేల్​ వెర్షన్ వచ్చేసింది​

ABOUT THE AUTHOR

...view details