తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వకీల్​సాబ్' రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా - వకీల్​ సాబ్​ టీజర్​ యూట్యూబ్​ ట్రెండింగ్​ నెం.1

హీరో పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్'​ టీజర్​ యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నెంబర్​1గా దూసుకెళ్తోంది. ఈ కథనం రాసేటప్పటికీ 10మిలియన్ల వ్యూస్​, 8లక్షల లైక్స్​ను అందుకుంది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.

pawan
పవన్

By

Published : Jan 16, 2021, 8:46 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. వెండితెరపై ఈ పేరును చూడాలని దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశకు జీవం పోస్తూ విడుదలైన 'వకీల్‌సాబ్‌' టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ న్యాయవాదిగా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు నెటిజన్లతోపాటు, సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. టీజర్‌.. పవర్‌ప్యాక్డ్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కథనం రాసేటప్పటికీ 10మిలియన్ల వ్యూస్​తో 8లక్షల లైక్స్​తో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ 1గా దూసుకెళ్తోంది.

'కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు' అంటూ పవన్‌ చెప్పే పంచ్‌ డైలాగ్‌తోపాటు ఆయన లుక్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌.. ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తున్నాయి. మరోవైపు నటుడు నాగబాబు, నిహారిక, వెన్నెల కిషోర్‌, రామ్‌చరణ్‌, హరీశ్‌ శంకర్‌, క్రిష్‌, తమన్‌, సాయిధరమ్‌ తేజ్‌, శ్రీకాంత్‌, బాబి, వరుణ్‌ తేజ్‌ తదితరులు... 'పవర్‌స్టార్‌ స్టైల్‌ను ఎవరూ మ్యాచ్‌ చేయలేరు. విజువల్‌ ట్రీట్‌ అదుర్స్. ఆయన రీఎంట్రీ సూపర్బ్‌గా ఉంది.‌' అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. 'వకీల్‌సాబ్‌' పక్కా సూపర్‌హిట్‌ చిత్రమంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details