పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(pawan kalyan upcoming movies) వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా రానుందట! అయితే ఇప్పుడు కథ విషయంలో అనిల్‌కు పవన్(pawankalyan updates) ఓ షరతు విధించినట్లు తెలిసింది. ఇప్పటికే రెడీ అయిన స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు తెలిసింది. హీరోయిజాన్ని హైలెట్ చేసేలా కాకుండా 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' తరహాలో కుటుంబ ప్రేక్షకులంతా చూసేలా సింపుల్‌గా, కామెడీగా ఉండాలని చెప్పారట!
పవన్‌తో అనిల్ రావిపూడి చిత్రం.. 'ఎఫ్2' తరహాలో! - pawan kalyan upcoming movies
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, దర్శకుడు అనిల్‌రావిపూడి(pawan kalyan upcoming movies) కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూవీ విషయంలో అనిల్‌కు పవన్(pawankalyan updates) ఓ కండిషన్ పెట్టారట.
పవన్
కాగా, 'పటాస్', 'ఎఫ్ 2', 'సరిలేరు నీకెవ్వరు', 'రాజా ది గ్రేట్' వంటి సినిమాలతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం 'ఎఫ్ 3' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే పవన్.. 'భీమ్లానాయక్'(pawankalyan bheemlanayak movie), 'హరిహర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్', సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నారు.
ఇదీ చూడండి:గోల్డెన్ డ్రెస్‌లో కంగన.. నోరా ఫతేహి స్టన్నింగ్ లుక్స్