పవన్ కల్యాణ్ హీరోగా మరో కొత్త చిత్రం - Sagar Chandra with Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మరో చిత్రానికి రంగం సిద్ధమైంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
![పవన్ కల్యాణ్ హీరోగా మరో కొత్త చిత్రం Pawankalyan new film with Sagar Chandra confirmed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9304695-584-9304695-1603603166605.jpg)
పవన్ కల్యాణ్ నుంచి మరో చిత్రం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మరో సినిమా రూపొందుతోంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా దర్శనమివ్వనున్నారు పవన్. దసరా పండుగ పురస్కరించుకుని ఈ సినిమా ప్రకటన చేసింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు.