తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ సినిమా గ్లింప్స్​ అప్డేట్​- ఆచార్య షెడ్యూల్​ పూర్తి - విజయ్​ ఆంటోని

శివరాత్రి కానుకగా తమ సినిమాలకు సంబంధించిన కొత్త అప్టేట్స్​ను ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి ఆయా చిత్రబృందాలు. ఇందులో పవన్​కల్యాణ్-క్రిష్​​, కార్తికేయ, విజయ్​ ఆంటోని సినిమా విశేషాలు ఉన్నాయి. కాగా, 'ఆచార్య' సినిమాలోని కీలక సన్నివేశాల షూటింగ్​ పూర్తైనట్లు ప్రకటించింది చిత్రబృందం.

acharya
ఆచార్య

By

Published : Mar 10, 2021, 6:28 PM IST

Updated : Mar 10, 2021, 10:55 PM IST

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​​-దర్శకుడు క్రిష్​ కాంబోలో రానున్న సినిమా ఫస్ట్​లుక్​ గ్లింప్స్​ మార్చి 11న సాయంత్రం 5.19గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

పవన్​కల్యాణ్​

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'చావు కబురు చల్లగా' సినిమాలోని 'ఫిక్స్​ అయిపో' వీడియో పాట మార్చి 11న ఉదయం 11గంటలకు విడుదల కానుంది.

చావు కబురు చల్లగా

పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న 'ఏక్​ మినీకథ' సినిమా టీజర్​ మార్చి 11న ఉదయం 9.30 గంటలకు రిలీజ్​ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్​లుక్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

విజయ్​ ఆంటోని నటించిన విజయ రాఘవన్​ సినిమాలోని తను చూసి నవ్వుకున్న అంటూ సాగే తొలి పాటను మార్చి 11న సాయంత్రం 5.01గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

విజయ రాఘవ

చిరంజీవి, రామ్​చరణ్​ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' సినిమా లాంగ్​ షెడ్యూల్​ షూటింగ్​ పూర్తైనట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రీకరణతో సినిమా షూటింగ్​ దాదాపుగా పూర్తైనట్లు అని తెలిపింది. ఈ ఏడాది మే 13న విడుదల కానుందీ సినిమా.

ఆచార్య
ఆచార్య

కన్నడ స్టార్​ హీరో దర్శన నటించిన 'రాబర్ట్'​ సినిమాలోని 'కన్నె అదిరింది' వీడియో పాట టీజర్​ను విడుదలైంది. మార్చి 11న విడుదల కానుందీ చిత్రం.

అహన్​ శెట్టి-తారాసుతారియా జంటగా నటిస్తున్న 'తడప్​' సినిమా షూటింగ్​ పూర్తైంది. ఈ చిత్రాన్ని మిలాన్​లుథ్రియా తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అర్ధ శతాబ్దం
Last Updated : Mar 10, 2021, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details