తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bheemlanayak: 'పవన్​ ఫైర్​ను ఆపడం చాలా కష్టం' - భీమ్లానాయక్​ సక్సెస్​ మీట్​

Pawankalyan Bheemlanayak success meet: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా కలిసి నటించిన భీమ్లానాయక్​ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సక్సెస్​ మీట్​ను నిర్వహించింది చిత్రబృందం. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దర్శకుడు సాగర్‌, సంగీత దర్శకుడు తమన్‌తోపాటు పలువురు చిత్రబృందం ఇందులో పాల్గొని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. వారు మాట్లాడిన విశేషాలివి..

Bheemlanyak success meet
Bheemlanyak success meet

By

Published : Feb 26, 2022, 2:07 PM IST

Pawankalyan Bheemlanayak success meet: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లానాయక్‌' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాకబస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పవన్‌ మేనియా’ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దర్శకుడు సాగర్‌, సంగీత దర్శకుడు తమన్‌తోపాటు పలువురు చిత్రబృందం ఇందులో పాల్గొని ధన్యవాదాలు తెలిపారు.

"ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. బెనిఫిట్‌ షో నుంచి ‘భీమ్లానాయక్‌’ ఓ ప్రభంజనంలా దూసుకువెళ్తోంది. ఇంత మంచి విజయంలో నేను కూడా భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నా. ఈ అవకాశం కల్పించిన టీమ్‌ మొత్తానికి నా ధన్యవాదాలుఠ

- రామజోగయ్య శాస్త్రి (పాటల రచయిత)

"ఇందులో నేను రెండు పాటలు రాశా. పవర్‌ తుపాన్‌లో నేను కూడా భాగస్వామినైనందుకు ఆనందిస్తున్నా. ‘రాములో రాములా’తో నన్ను పరిచయం చేసిన త్రివిక్రమ్‌.. ఈ సినిమాతో నాలోని ప్రతిభను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేశారు. భీమ్లానాయక్‌ బీభత్సాన్ని, డేనియల్‌ శేఖర్‌ అరాచకాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్లాలని కోరుకుంటున్నా"

- కాసర్ల శ్యామ్‌ (పాటల రచయిత)

"మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది మా సినిమా అని చెప్పకూడదు.. ఎందుకంటే పవన్‌ సినిమా అంటేనే అందరి సినిమా అవుతుంది. కాబట్టి మన సినిమా ఇంతటి ఘన విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. నిన్న ఒక మాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశా. ప్రతి సీన్‌కి ప్రేక్షకులతో కలిసి నేను కూడా కేకలు, ఈలలు వేశా. నటిగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి దీనికంటే బెస్ట్‌ మూవీ ఉండదని నమ్ముతున్నా"

- సంయుక్తా మేనన్‌

"ఈ సినిమాలో నేను పవర్‌స్టార్‌ పక్కన కానిస్టేబుల్‌ రోల్‌ చేశా. నా పాత్రకు అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ పాత్ర కోసం నన్ను సెలక్ట్‌ చేసి నాకిలాంటి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత వంశీకి ధన్యవాదాలు. కెరీర్‌ ప్రారంభంలోనే ఇలాంటి ఛాన్స్‌ రావడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం"

- ప్రియాంక

"ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు దేవుడుకి కృతజ్ఞతలు. టీమ్‌ మొత్తం, ముఖ్యంగా ఎప్పటికీ నా గుండెల్లో నిలిచి ఉండే గురువు త్రివిక్రమ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థియేటర్లలో పవన్‌ సర్‌ స్టెప్పులకు ప్రేక్షకులు ఈలలు వేస్తుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఇక, సంగీతంతో తమన్‌ దుమ్ములేపేశారు. ఈ సినిమాతో ప్రతిఒక్కరూ పవన్‌కి ఫ్యాన్స్‌ అయిపోయారు"

- కొరియోగ్రాఫర్‌ గణేశ్‌

"మా అందరికీ తెలుసు ‘భీమ్లానాయక్‌’ పెద్ద తుపాన్‌ అని. సినిమా విడుదల చేయడానికి ముందు ఎన్నో వదంతులు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పడానికి సుమారు ఏడు నెలల నుంచి ఎంతో కష్టపడి ఫిబ్రవరి 25న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. మా సంకల్పం గొప్పగా ఉంది.. అందుకే ఈసినిమా కూడా పెద్ద కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. ‘భీమ్లానాయక్‌’ ఒక ప్రయాణం. ఈ ప్రయాణం సాఫీగా సాగేలా త్రివిక్రమ్‌ ఎంతో స్వేచ్ఛ, సపోర్ట్‌ ఇచ్చారు. అందరూ నన్ను ఈ సినిమాకి పిల్లర్‌ అంటున్నారు. కానీ ఆ పిల్లర్‌ నిలబడటానికి సిమెంట్‌, సపోర్ట్ ఇచ్చింది ఆయనే. అందుకు ఆయనకు థ్యాంక్స్‌ చెప్పాలి. ‘భీమ్లానాయక్‌’ వైల్డ్‌ ఫైర్ లాంటిది. ఈ ఫైర్‌ని ఆపడం.. చాలా కష్టం. త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్‌లో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక కల ఉంది. అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు"

- తమన్‌



ఇదీ చూడండి: బాక్సాఫీస్​పై 'భీమ్లానాయక్​' దండయాత్ర.. నైజాంలో ఆల్​టైం రికార్డ్​!

ABOUT THE AUTHOR

...view details