తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీమ్లానాయక్'​ నుంచి అదిరిపోయే అప్డేట్​ - పవన్​కల్యాణ్​ భీమ్లానాయక్​

'భీమ్లానాయక్'​ సినిమాలోని 'లాలా భీమ్లా' సాంగ్​కు సంబంధించిన ప్రోమోను సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. దీంతోపాటే పవన్​ మాస్​లుక్​లో ఉన్న ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఈ చిత్రంలో పవన్​ కల్యాణ్​, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

bheem
భీమ్​

By

Published : Nov 3, 2021, 11:06 AM IST

Updated : Nov 3, 2021, 11:23 AM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లానాయక్‌'​. ఈ సినిమాలోని 'లాలా భీమ్లా' సాంగ్​కు సంబంధించిన ప్రోమోను ఈరోజు(నవంబరు 3) సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పవన్​ మాస్​ లుక్​లో మందు సీసా, బాంబులను పక్కన పెట్టుకుని కూర్చొని కనిపించారు.

మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' రీమేక్‌గా 'భీమ్లానాయక్‌' సిద్ధమవుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అహం, ఆత్మాభిమానం.. అనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్‌కల్యాణ్‌.. భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే రానా.. డేనియల్‌ శేఖర్‌గా అలరించనున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌, రానాకు జోడీగా సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్పెషల్‌ వీడియోలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి.

భీమ్లానాయక్​

ఇదీ చూడండి: టాప్ లెస్ ఫొటోలతో షాక్​కు గురిచేసిన స్టార్ హీరోయిన్లు!

Last Updated : Nov 3, 2021, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details