Bheemla nayak collections 100crores: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. 'భీమ్లా నాయక్' అదరగొడుతోంది. ప్రేక్షకులందరినీ విపరీతంగా అలరిస్తూ కలెక్షన్లలో దూకుడు ప్రదర్శిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లోనూ వసూళ్లలో జోరు చూపిస్తోంది.
ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన 'భీమ్లా నాయక్'.. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చింది. అలా రిలీజ్ అయినా మూడు రోజుల్లో రూ.100 కోట్లు కలెక్షన్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు మనోబాల ట్వీట్ చేశారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. యూఎస్‌లోనూ మూడు రోజుల్లోనే ఈ సినిమా, రెండు మిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించింది.