తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్, ప్రభాస్, బాలయ్య అభిమానులకు నిరాశే! - ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్

వారం రోజుల నుంచి టాలీవుడ్​ కళకళలాడుతోంది. సినిమా రిలీజ్​లు, కొత్త చిత్రాల విడుదల తేదీ ప్రకటనలతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాల అప్​డేట్స్ రాగా కొందరు హీరోలు మాత్రం ఇప్పటివరకు వారి చిత్రాల అప్​డేట్స్ ఇవ్వలేదు. వారెవరో చూద్దాం.

Pawan, Prabhasm Balayya
పవన్, ప్రభాస్, బాలయ్య అభిమానులకు నిరాశే!

By

Published : Jan 30, 2021, 2:12 PM IST

కొత్త ఏడాదిలో తెలుగు చిత్రపరిశ్రమ కళకళలాడుతోంది. ఓ వైపు సినిమా రిలీజ్‌లు.. మరోవైపు కొత్త చిత్రాల వరుస అప్‌డేట్స్‌తో సినీ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఇక, టాలీవుడ్‌కు చెందిన అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఈ ఏడాదిలో సినిమా విడుదలకు సంబంధించిన స్లాట్‌లు బుక్‌ చేసుకుంటూ తమ చిత్రాల రిలీజ్‌ డేట్స్‌ను ప్రకటించేశారు. అలా ఇప్పటివరకూ 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఆచార్య', 'నారప్ప', 'సర్కారువారిపాట', 'పుష్ప', 'గని'తోపాటు 'కేజీఎఫ్‌-2' విడుదల తేదీలను అనౌన్స్‌ చేశారు. కాకపోతే సినీప్రియులు మాత్రం మరికొన్ని ప్రాజెక్ట్‌ల అప్‌డేట్స్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్‌లు ఏమిటి? అందులోని హీరోలు ఎవరు? ఒక్కసారి చూసేయండి..

'వకీల్​సాబ్' వస్తాడా?

"కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు.." అంటూ ఇటీవల అభిమానుల్ని ఫిదా చేశారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఆగస్టు 9న 'వకీల్‌సాబ్‌' విడుదలయ్యే అవకాశాలున్నాయంటూ నెట్టింట్లో పోస్టులు దర్శనమిస్తున్నప్పటికీ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

'రాధేశ్యామ్​' ఆగమనం కోసం

"మేఘశ్యామ మధుసూదనా.. రాధేశ్యామ యదునందనా" అంటూ బీట్స్‌తోనే గతేడాది మదిదోచేశారు 'రాధేశ్యామ్‌' టీమ్‌. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడం వల్ల నిరాశకు గురైన నెటిజన్లు దర్శకనిర్మాతలకు సోషల్‌మీడియా వేదికగా మెస్సేజ్‌లు చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న 'రాధేశ్యామ్‌' టీజర్‌ ఉండొచ్చని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేదు.

బాలయ్య గర్జన ఎప్పుడో?

బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా స్పెషల్‌ గ్లిమ్స్‌ చూసి అభిమానులు ఎంతో ఆనందించారు. గతేడాది విడుదలైన గ్లిమ్స్‌ మినహా ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ అప్‌డేట్స్‌ ఒక్కటి కూడా బయటకు రాలేదు.

ABOUT THE AUTHOR

...view details