పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫాన్స్ మరోసారి సోషల్ మీడియాలో సత్తా చాటారు. నెట్టింట మాస్ సెలబ్రేషన్స్ పేరిట ట్వీట్ల రూపంలో సునామీ సృష్టించారు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి ట్రెండింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు పవర్‌స్టార్ ఫ్యాన్స్. కానీ ఈసారి ట్రెండింగ్ వేలను, లక్షలను దాటి కోట్లకు చేరింది.
ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ హంగామా.. ప్రపంచ రికార్డు కైవసం - పవన్ కల్యాణ్ లేటెస్ట్ న్యూస్
'నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా' అనే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్‌ను ఆయన అభిమానులూ పాటిస్తున్నారు. త్వరలో పవన్ పుట్టినరోజు పురస్కరించుకుని ట్విట్టర్లో సరికొత్త రికార్డు సృష్టించారు. పవన్ పుట్టినరోజు కామన్ డీపీ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లోనే 65 మిలియన్ ట్వీట్లు వేశారు.

ఇటీవలే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ రికార్డును దక్కించుకోవాలని ఆయన అభిమానులు ప్రయత్నించినా..అది కొద్దిలో చేజారిపోయింది. కానీ, పవన్ అభిమానులు కాస్త అడ్వాన్స్గానే ఈ రికార్డును తిరగరాశారు. బర్త్‌డే కామన్ డీపీ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రపంచంలోనే అత్యధిక ట్వీట్ల ట్రెండ్‌ను ఆయన పేరిట నమోదు చేశారు.
#PawankalyanBirthdayCDP అనే హ్యాషట్యాగ్పై 24 గంటల వ్యవధిలో 65 మిలియన్ ట్వీట్లతో సరికొత్త రికార్డును నెలకొల్పారు పవన్ అభిమానులు. పవన్ కల్యాణ్ పుట్టినరోజుకు సంబంధించిన కామన్ డీపీ కోసమే ఇలా ఉంటే.. ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 2న పవన్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.