పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్'. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. లాక్‌డౌన్ అనంతరం ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మేరకు తాజాగా 'వకీల్‌సాబ్'కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను నగరంలోని నిజాం కళాశాలలో చిత్రీకరిస్తున్నారు.
నెట్టింట వైరల్‌గా 'వకీల్‌సాబ్' షూటింగ్ ఫొటోస్ - నెట్టిండి 'వకీల్‌సాబ్' షూటింగ్ ఫొటోస్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'వకీల్‌సాబ్'. తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు పవన్. హైదరాబాద్‌లో జరుగుతోన్న షూటింగ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
షూటింగ్ సమాచారం తెలుసుకున్న ఎంతోమంది అభిమానులు పవన్‌ను కలుసుకునేందుకు సెట్ వద్దకు చేరుకున్నారు. తనని చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదంతో పాటు పలువురితో ఫొటోలకు పోజులిచ్చారు పవన్. ప్రస్తుతం 'వకీల్‌సాబ్' సెట్ నుంచి పవన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ దాదాపు మూడేళ్ల విరామం అనంతరం 'వకీల్‌సాబ్'తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశారు తెరకెక్కించనున్నట్లు సమాచారం.