పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే మూడు చిత్రాల్ని ఒప్పుకొని, రెండింటికి సంబంధించిన చిత్రీకరణల్లో పాల్గొంటున్నాడు. తాజాగా మరో దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది. అతడే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇతడు పవన్ కోసం ఓ కథ రాస్తున్నాడని సమాచారం. జూ.ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాత ఇది సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.
నాలుగోసారి పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్! - పవన్ త్రివిక్రమ్
తన స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌తో మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాడు హీరో పవన్‌కల్యాణ్. ఈ విషయమై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
![నాలుగోసారి పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్! pawan kalyan's new movie will direct by trivikram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6129310-809-6129310-1582117280844.jpg)
నాలుగోసారి పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్!
వీరిద్దరి కాంబినేషన్లో గతంలో 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రాబోతున్న చిత్రం కోసం పవర్ఫుల్ కథను తయారు చేస్తున్నాడట త్రివిక్రమ్. ఈ విషయంపై స్పష్టత రావాలంటే కొన్నిరోజుల ఆగక తప్పదు.
ఇదీ చూడండి.. ఐటీ దాడుల విషయంపై స్పందించిన హీరోయిన్ రష్మిక
Last Updated : Mar 1, 2020, 9:04 PM IST