తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' సెట్​లో పవన్​కల్యాణ్ - Pawan Kalyan news

షూటింగ్ గ్యాప్​లో పక్కన జరుగుతున్న 'ఆర్ఆర్ఆర్' సెట్​కు పవర్​స్టార్ పవన్​కల్యాణ్ వెళ్లారు. దర్శకుడు రాజమౌళితో కాసేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan's formal visit to RRR set sparks speculations
'ఆర్ఆర్ఆర్' సెట్​లో పవన్​కల్యాణ్

By

Published : Feb 20, 2021, 9:33 AM IST

'ఆర్ఆర్ఆర్' చిత్రబృందానికి పవర్​స్టార్ పవన్​కల్యాణ్ సర్​ప్రైజ్ ఇచ్చారు. 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్​ షూటింగ్​లో భాగంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్న ఆయన.. అక్కడే చిత్రీకరణ జరుపుతున్న 'ఆర్ఆర్ఆర్' సెట్​లోకి వెళ్లారు. జూ.ఎన్టీఆర్, రాజమౌళితో కాసేపు మాట్లాడారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది.

'ఆర్ఆర్ఆర్' ఈ ఏడాది అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్​గా నటిస్తున్నారు.

మరోవైపు 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్​లో పవన్​తో పాటు రానా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. త్రివిక్రమ్, మాటలతో పాటు స్క్రీన్​ప్లే అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది చదవండి:కొత్త సినిమా కోసం సంస్థానంలో పవన్

ABOUT THE AUTHOR

...view details