తెలంగాణ

telangana

'అల వైకుంఠపురములో' బృందానికి పవన్​ సర్​ప్రైజ్​ గిఫ్ట్​

By

Published : Jan 13, 2020, 6:45 PM IST

బన్నీ-త్రివిక్రమ్​ల 'అల వైకుంఠపురములో' సినిమాపై హీరో పవన్​కల్యాణ్​ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు.

'అల వైకుంఠపురములో' బృందానికి పవన్​ సర్​ప్రైజ్​ గిఫ్ట్​
పవన్​కల్యాణ్-అల్లు అర్జున్

పవర్​స్టార్ పవన్​కల్యాణ్.. 'అల వైకుంఠపురములో' చిత్రబృందాన్ని సర్​ప్రైజ్​ చేశాడు. బొకే పంపి శుభాకాంక్షలు చెప్పాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్విట్టర్​లో వెల్లడించింది.

'అల వైకుంఠపురములో' బృందానికి పవన్​ సర్​ప్రైజ్​ గిఫ్ట్​

థియేటర్లలోకి ఆదివారం వచ్చిన ఈ చిత్రం.. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. త్రివిక్రమ్ పంచ్​లకు తోడు, బన్నీ అద్భుత ప్రదర్శన అభిమానుల్ని అలరిస్తోంది.

వీరితో పాటే గతనెలలో వచ్చిన 'ప్రతిరోజూ పండగే' బృందానికి విషెస్ చెప్పాడు పవన్. హీరో సాయితేజ్​, దర్శకుడు మారుతిలకు బొకేలు పంపించాడు. వాటిని సోషల్​ మీడియా వేదికగా వారిద్దరూ పంచుకున్నారు.​

పవన్​కల్యాణ్ పంపిన బొకేను పోస్ట్ చేసిన మెగాహీరో సాయితేజ్

ABOUT THE AUTHOR

...view details