'మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు' అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. 'ఉప్పెన' శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్‌తేజ్.. కొత్త సినిమా సెట్‌కు వెళ్లి పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా 'ఉప్పెన' టీమ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
'ఉప్పెన' బృందానికి పవన్‌కల్యాణ్ విషెస్
'ఉప్పెన'లోని కొన్ని సన్నివేశాలు చూసిన పవన్‌కల్యాణ్ చిత్రబృందాన్ని ప్రశంసించారు. విడుదల సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.
'ఉప్పెన' బృందానికి పవన్‌కల్యాణ్ విషెస్
ప్రేమకథతో తీసిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుకు కూడా ఇదే తొలి చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
ఇది చదవండి:ఆ నమ్మకాన్ని చిరంజీవి రెట్టింపు చేశారు: వైష్ణవ్‌తేజ్