తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​తో సినిమాపై స్పందించిన హరీశ్​ శంకర్​ - పవన్​కల్యాణ్​ కొత్త సినిమా

'గబ్బర్ ​సింగ్​' చిత్రంతో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​కు హిట్ ఇచ్చిన దర్శకుడు హరీశ్​ శంకర్​. తాజాగా పవన్​తో ఈ దర్శకుడు మరో చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అయితే ఇదో రీమేక్​ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించాడు హరీశ్.

Pawan Kalyan will team up with director Harish Shankar, confirms Mythri Movie Makers
పవన్​ రీమేక్​లపై స్పందించిన హరీశ్​ శంకర్​

By

Published : Feb 4, 2020, 9:36 PM IST

Updated : Feb 29, 2020, 4:52 AM IST

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్​కు 'గబ్బర్‌ సింగ్‌'తో ఓ మంచి విజయాన్ని అందించిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఇప్పుడు ఈ హిట్‌ కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఇటీవల ప్రకటించింది.

తమిళంలో ఘన విజయం సాధించిన విజయ్‌ 'తేరీ', అజిత్‌ 'వేదాళం' చిత్రాల్లో ఏదో ఒకదానికి రీమేక్‌ చేయాల్సిందిగా నిర్మాణ సంస్థ హరీశ్‌ శంకర్‌ను కోరినట్లు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వస్తున్నాయి. గతంలో పవన్‌తో 'తేరీ'ని తీయాలని మైత్రీ మూవీ మేకర్స్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హరీశ్‌ను ఆ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి రీమేక్‌ చేయమని కోరినట్లు వార్తలు రావడంపై స్పందించాడీ దర్శకుడు.

పవన్​ రీమేక్​లపై స్పందించిన హరీశ్​ శంకర్​

" విలేకర్లకు ఫోన్​ కాల్​ దూరంలో అందుబాటులో ఉంటా. ఏ విషయాన్ని అయినా నన్ను అడిగి తెలుసుకోవచ్చు. పాఠకులను తప్పుదోవ పట్టించొద్దు."
- హరీశ్​ శంకర్​, దర్శకుడు

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ తన 28వ చిత్రంలో నటించనున్నాడు. దీంతో పాటు 'పింక్‌' రీమేక్‌తో పాటు, క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టులు ఇప్పటికే షూటింగ్ ప్రారభించుకున్నాయి . ఈ సినిమాలు పూర్తయిన వెంటనే హరీశ్‌ శంకర్‌తో మూవీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కథ, నటీనటులు, సాంకేతిక బృందంపై కసరత్తులు చేస్తున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన రానుంది.

ఇదీ చదవండి:పవర్​స్టార్​ కొత్త సినిమాలో రంగమ్మత్తకు ఛాన్స్..!​

Last Updated : Feb 29, 2020, 4:52 AM IST

ABOUT THE AUTHOR

...view details