తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​కల్యాణ్ 'పింక్' హీరోయిన్ ఎవరు? - పవన్​ కల్యాణ్​ పింక్​ కథానాయిక

పవన్​ కల్యాణ్ 'పింక్​' రీమేక్ షూటింగ్ సోమవారం నుంచి​ ప్రారంభం కానుంది. అయితే పవర్​స్టార్​ సరసన నటించే హీరోయిన్ ఎవరు? అనేదానిపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మరో వారం రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది.

pawan kalyan will star in pink remake
'పింక్​' నాయిక ఎవరో..?

By

Published : Jan 20, 2020, 10:06 AM IST

పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్‌ అభిమానుల నిరీక్షణ ఫలించింది. సోమవారం నుంచి 'పింక్‌' రీమేక్‌ చిత్రం ప్రారంభం కానుంది. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రలో పవన్‌ నటించనున్నాడు. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌రాజు, బోనీకపూర్‌ నిర్మాతలు. 'పింక్‌' కథలో పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. పాటలు, పోరాట ఘట్టాలు ఉండేలా కథను మార్చినట్టు సమాచారం. అంతే కాదు... పవన్‌ సరసన కనిపించనున్న హీరోయిన్ ఎవరన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

అయితే ఈ సినిమాలో, వరస హిట్లతో దూసుకెళ్తోన్న పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు గుసగుసలు. మరో వారం రోజుల్లో ఇందులో కథానాయిక విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చదవండి: వేశ్య.. నటి.. గాయని.. వెండితెరపై నిజజీవితం

ABOUT THE AUTHOR

...view details