తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హరీశ్ సినిమాలో డాన్​గా పవన్! - పవన్ హరీశ్ సినిమా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పవన్ డాన్​గా కనిపించనున్నారని సమాచారం.

Pawan will be seen as Don in the new film
హరీశ్ సినిమాలో డాన్​గా పవన్!

By

Published : Nov 1, 2020, 10:40 PM IST

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టును సిద్ధం చేశారట హరీశ్. ఈ సినిమాలో పవర్ స్టార్ కొన్ని నిమిషాల పాటు డాన్​గా కనిపిస్తారట. అయితే ఫ్లాష్ బ్యాక్​లో వచ్చే కొన్ని సన్నివేశాల్లోనే పవన్ ఈ గెటప్​లో కనిపిస్తారని సమాచారం. దీంతో ఫ్యాన్స్​లో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతంలో పవన్-హరీశ్ కాంబోలో వచ్చిన 'గబ్బర్​సింగ్' బ్లాక్​బస్టర్​గా నిలిచింది. వరుస ఫ్లాప్​ల్లో ఉన్న పవన్​కు బంపర్ హిట్ అందించింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో సినిమా రాబోతుండటం వల్ల అందరి చూపు ఈ ప్రాజెక్టుపైనే పడింది.

ABOUT THE AUTHOR

...view details