Pawan kalyan remake: ఈ ఏప్రిల్‌లో 'వకీల్‌సాబ్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ రెండు సినిమాలు రీమేక్‌లే కావడం విశేషం. ఇప్పుడు మరో రీమేక్‌కు పవన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ అక్టోబరులో నేరుగా ఓటీటీలో రిలీజైన తమిళ సినిమా 'వినోదయ సితమ్'. సముద్రఖని దర్శకత్వం వహిస్తూ కీలకపాత్రలో నటించారు. ఇప్పుడు ఈ సినిమాలోనే పవన్ నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అలానే తెలుగు చిత్రానికి కూడా సముద్రఖనినే డైరెక్షన్ చేయనున్నారని సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.