పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రీకరణ మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్.. దాదాపు ఏడు నెలల తర్వాత ఇటీవలే పునఃప్రారంభించారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయస్థానం సెట్లో దర్శకుడు వేణుశ్రీరామ్ పవన్‌పై కీలక సన్నివేశాలు తీశారు.
'వకీల్‌సాబ్' సెట్లోకి పవన్ ఎంట్రీ - వకీల్‌సాబ్ వార్తలు
చాలా నెలల తర్వాత 'వకీల్‌సాబ్' సెట్లో పవన్ తిరిగి అడుగుపెట్టారు. ఆయనపై కీలక సన్నివేశాల్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తీశారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
!['వకీల్‌సాబ్' సెట్లోకి పవన్ ఎంట్రీ pawan kalyan vakeelsaab shooting restart at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9392202-584-9392202-1604231931450.jpg)
'వకీల్‌సాబ్' సెట్లో అడుగుపెట్టిన పవర్‌స్టార్
అన్యాయానికి గురైన బస్తీ వాసులకు అండగా పోరాడేందుకు సిద్ధమంటూ భరోసా ఇచ్చే సన్నివేశాలను పవన్‌పై చిత్రీకరించారు. 'వకీల్ సాబ్' కోర్టుకు వెళ్లే సన్నివేశంలో కథానాయికలు అంజలి, నివేదా థామస్, అనన్యలు పాల్గొన్నారు. అమితాబ్ 'పింక్' చిత్రానికి రీమేక్ ఈ సినిమా. తమన్ సంగీత దర్శకడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.