ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలోని తొలి గీతం వచ్చేసింది. తమన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట హల్చల్ చేస్తోంది.
అలరిస్తున్న 'వకీల్ సాబ్' తొలి గీతం ప్రోమో - powerstar pawan kakyan new movie updates
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలోని తొలి గీతం ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
![అలరిస్తున్న 'వకీల్ సాబ్' తొలి గీతం ప్రోమో వకీల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6318603-thumbnail-3x2-wak.jpg)
వకీల్
'మగువా మగువా' అంటూ సాగే ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. పూర్తి పాటను మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.