తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రిష్​తో పవన్ సినిమా.. కథేంటంటే..! - pawan kalyan

టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్​ సినీ రీ ఎంట్రీపై స్పష్టత వచ్చేసింది. ప్రస్తుతం తనకు తగిన స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నాడట పవన్. క్రిష్​ చెప్పిన కథకు పవన్ ఓకే చెప్పినట్లు సమాచారం.

పవన్ కల్యాణ్

By

Published : Oct 28, 2019, 2:41 PM IST

పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం పవన్‌ కూడా ఈ పని మీదే బిజీగా గడిపేస్తున్నాడు. వరుసగా కథలు వింటూ తన సినిమాల్లో పునరాగమనం చేయడానికి తగిన స్క్రిప్టును ఎంచుకునే పనిలో ఉన్నాడు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్‌స్టార్‌.. దర్శకుడు క్రిష్‌ చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా చేసుకుని చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్‌ది అందె వేసిన చేయి. ప్రస్తుతం పవన్‌ రాజకీయ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇదే తరహా కథను సిద్ధం చేసినట్లు వార్తలొస్తున్నాయి.

ఇదొక సోషల్‌ పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంతో సాగబోతుందట. వందల ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనని స్ఫూర్తిగా తీసుకుని జానపద కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో పవన్‌ పాత్ర సరికొత్తగా ఉండనుందట. పవన్‌ ఇప్పటి వరకు ఈ తరహా కథల్లో నటించలేదు. కాబట్టి సినీప్రియులకూ ఈ ప్రాజెక్టు ఓ సరికొత్త అనుభూతిని మిగల్చబోతున్నట్లు అర్థమవుతోంది.

'పింక్‌' రీమేక్‌ వైపు పవన్‌ దృష్టి సారించినట్లు సమాచారం అందుతోంది. ఇది కూడా ఓ సందేశాత్మక కథతో రూపొందబోయే చిత్రమే. మరి ఈ రెండు ప్రాజెక్టులకు పవర్​స్టార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడా? లేక క్రిష్‌ వైపు మాత్రమే మొగ్గు చూపుతాడా? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ఇవీ చూడండి.. బజరంగీ భాయ్​జాన్ అంటే సినిమా కాదు.. !

ABOUT THE AUTHOR

...view details