ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతిపట్ల జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో ఉంచిన ఆమె భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. విజయనిర్మల మరణ వార్త తననెంతగానో బాధించిందన్నారు.
'అలాంటి వ్యక్తి మరణం బాధాకరం' - vijaya nirmala
టాలీవుడ్ అలనాటి నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. విజయనిర్మల మరణ వార్త తననెంతగానో బాధించిందన్నారు.
తమ కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు ఆమె ఇంటి ఎదురుగానే ఉండేవాళ్లమని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేసుకున్నారు. నరేశ్, ఆయన కుమారుడు నవీన్‌తో తమ ఇంటికి వచ్చి వెళ్తుండేవారనీ.. అప్పటినుంచి ఆ కుటుంబంతో బంధం ఉందన్నారు. కేవలం నటిగానే కాకుండా మహిళా దర్శకురాలిగా ఆమె ఘన విజయాలు సాధించారని కొనియాడారు. అలాంటి వ్యక్తి దూరం కావడం తనకు బాధ కల్గించిందన్నారు. విజయ నిర్మల కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ చెప్పారు.
ఇవీ చూడండి.. 'అందరూ అనుకున్నట్లు కాదు.. నేను బేసిగ్గా విలన్ని'