దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా 'వకీల్ సాబ్'. హిందీ హిట్ 'పింక్'కు రీమేక్ ఇది. కాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుగుతున్న సమయంలో పవన్ రోజూ 600 కిలోమీటర్లు ప్రయాణించేవారని దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పారు. సినిమా షూటింగ్‌కు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు పవన్ చాలా కష్టపడ్డారని తెలిపారు.
'పవన్ రోజూ 600 కి.మీ ట్రావెల్ చేసేవారు' - వకీల్ సాబ్ షూటింగ్ అప్డేట్స్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ రోజూ దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు.
పవన్ దాదాపు 22 రోజులపాటు విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణించారని, ప్రతి రోజూ 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసేవారని చెప్పారు. ఒక్క రోజు కూడా షూట్‌ను మిస్ చేయలేదంటూ ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు. సినిమాకు సంబంధించిన ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయిందని తెలిపారు. లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత మిగిలిన భాగం షూటింగ్ కూడా పూర్తి చేస్తామని అన్నారు.
ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, నరేశ్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పిస్తున్నారు.