శర్వానంద్, సిద్ధార్థ్(sharwanand mahasamudram) ప్రధాన పాత్రల్లో దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తోన్న చిత్రం 'మహా సముద్రం'. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు(సెప్టెంబరు 23) ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. లవ్, యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఒకే ఫ్రేమ్‌లో శర్వానంద్, సిద్ధార్థ్ కనిపించి, సందడి చేశారు. ఇద్దరూ పోటీపడి నటించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
చీఫ్ గెస్ట్‌గా పవన్
మెగాహీరో సాయితేజ్(republic sai dharam tej) నటించిన కొత్త సినిమా 'రిపబ్లిక్'. అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా సెప్టంబరు 25న జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది చిత్రబృందం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఇటీవల సాయితేజ్‌కు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారాయన. అందుకే ఈ వేడుకకు తేజ్ రావట్లేదు. ఈ నేపథ్యంలోనే పవర్‌స్టార్ రంగంలోకి దిగారు! ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్. దేవాకట్టా దర్శకుడు.