పవన్‌స్టార్ పవన్‌కల్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. సినిమా ఈవెంట్లకు ఇటీవల కాలంలో హాజరు కాలేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. హైదరాబాద్‌లో ఆదివారం(నవంబరు 17) జరిగే 'జార్జ్‌రెడ్డి' ప్రీరిలీజ్ కార్యక్రమానికి హాజరు కానున్నాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
'జార్జ్‌రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్! - pawan kalyan to be attend george reddy pre release event
హైదరాబాద్‌లో ఆదివారం జరిగే 'జార్జ్‌రెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో పవన్‌కల్యాణ్ హాజరు కానున్నాడని సమాచారం. విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.
'జార్జ్‌రెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్!
'జార్జ్‌రెడ్డి' సినిమాను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించారు. 1970లో యూనివర్సిటీలో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో చూపించనున్నారు. 'వంగవీటి' ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. జీవన్‌రెడ్డి దర్శకుడు. దసరాకు విడుదలైన ట్రైలర్ అంచనాల్ని పెంచుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'జార్జ్ రెడ్డి'.. ఉస్మానియా వీరుడి ఉద్యమ యాత్ర
TAGGED:
పవన్ కళ్యాణ్