కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత బేధాలు లేవని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సుకు సన్నద్దమవుతూ బిజీ షెడ్యూల్లో కూడా తన 'భీమ్లానాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడం పట్ల కేటీఆర్‌కు పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎంత భావ వైరుధ్యాలున్నా, రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉందని కొనియాడిన పవన్ కల్యాణ్.. బండారు దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు.