తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అచ్చం పవన్​కల్యాణ్​లానే ఉందిగా! - Pawan kalyan son and daugher photos viral

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-అన్నాలెజినోవాల కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ హైదరాబాద్‌ విమానాశ్రయంలో సందడి చేశారు. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

pawan
పవన్​

By

Published : Dec 17, 2020, 5:49 PM IST

హీరో పవన్‌కల్యాణ్‌-అన్నాలెజినోవాల కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఇటీవల తన తల్లితో కలిసి రష్యాకు వెళ్లిన వీళ్లిద్దరూ.. గురువారం భాగ్యనగరానికి చేరుకున్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో అన్నాలెజినోవాతోపాటు పవన్ పిల్లల్ని చూసిన పలువురు నెటిజన్లు.. ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు.

అన్నాలెజినోవా-కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంజనా పవనోవా.. అచ్చం తన తండ్రిలాగానే సింపుల్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం 'వకీల్‌సాబ్‌' షూట్‌లో బిజీగా ఉన్నారు.

అచ్చం తండ్రిలాగానే
కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్
పవన్​ చిన్న కుమార్తె

ఇదీ చూడండి : నెట్టింట వైరల్​గా 'వకీల్​సాబ్​' షూటింగ్​ ఫొటోస్

ABOUT THE AUTHOR

...view details