తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్ వారసుడు టాలీవుడ్​లోకి గ్రాండ్ ఎంట్రీ! - pawan kalyan renu desai son

స్టార్ హీరో పవన్​కల్యాణ్​ తనయుడు అకీరా(akira nandan movie).. త్వరలో తెలుగులోని భారీ బడ్జెట్​ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఈ విషయమై చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత?

Pawan Kalyan son Akira
పవన్ కల్యాణ్ అకీరా నందన్

By

Published : Oct 27, 2021, 8:45 AM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్(pawan kalyan son) వారసుడు అకీరా నందన్(akira nandan movie) గ్రాండ్​ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈ విషయమై ప్రస్తుతం టాలీవుడ్​లో తెగ చర్చించుకుంటున్నారు.

పవన్​-రేణు దేశాయ్​ల(pawan kalyan renu desai son) కుమారుడు అకీరా నందన్. తల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ సినిమా 'ఇష్క్ వాలా లవ్'.. అతిథి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అలరించేందుకు రెడీ అయిపోయాడు. పవన్​ 'హరిహర వీరమల్లు'లోని(harihara veeramallu release date) ఓ కీలకపాత్ర కోసం ఇతడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో చిన్నప్పటి పవన్ కల్యాణ్​గా(pawan kalyan new movie) అకీరా నటించనున్నాడట.

తల్లి రేణు దేశాయ్​తో అకీరా

ఆరడగులకుపైగానే ఎత్తున్న అకీరా(akira nandan height).. కర్రసాము చేస్తూ కొన్నాళ్ల క్రితం ఓ వీడియోలో కనిపించాడు. ఇతడి వెండితెర అరంగేట్రం ఎప్పుడా అని పవర్​స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి 'హరిహర వీరమల్లు'లో అకీరా నటించే విషయమై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించే వరకూ ఎదురుచూడాల్సిందే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details