తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తెలుగు హీరోలు చాలా మందికి తెలుగే సరిగా రాయడం రాదు' - తెలుగు హీరోలపై పవన్​కల్యాణ్ వ్యాఖ్యలు

'తెలుగు వైభవం' పేరుతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన హీరో-రాజకీయ నాయకుడు పవన్​కల్యాణ్.. టాలీవుడ్​ హీరోలపై మండిపడ్డాడు. వారిలో కొంతమందికి తెలుగు రాయడం అస్సలు రాదని అన్నాడు.

టాలీవుడ్ హీరోలపై పవన్ సంచలన వ్యాఖ్యలు
పవన్​కల్యాణ్

By

Published : Dec 2, 2019, 8:33 PM IST

Updated : Dec 2, 2019, 10:08 PM IST

తెలుగు సినిమా హీరోలపై నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగులో మాట్లాడటం తెలుసో లేదో తెలియదు కానీ తెలుగులో రాయడం అస్సలు రాదని అన్నాడు. సినీ పరిశ్రమలో తెలుగు భాష దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ కల్యాణ్ ... తిరుపతిలో 'తెలుగు వైభవం' పేరుతో పలువురు భాష పండితులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాడు. ఇందులో తెలుగు సినిమా హీరోల భాషపై తనదైన శైలిలో మాట్లాడాడు.

తెలుగు వైభవం' సమావేశంలో పవన్​కల్యాణ్

"తెలుగు సినీ పరిశ్రమలో పాండిత్యం రానురాను దిగజారిపోతుంది. మన రచయితలకు శాస్త్రాలు, పాండిత్యం తెలియవు. తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లకు పడిపోయింది. ఈ స్థాయిలో ప్రమాణాలు దిగజారాయి కనుకే ఆడపిల్లలను రోడ్లమీదనే అత్యాచారాలు చేస్తున్నారు. మాతృభాషను మరిచిపొతే వచ్చిన దుస్థితి ఇది. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగు మాట్లాడం తెలుసో లేదో నాకు తెలియదు కానీ రాయడం మాత్రం సరిగా రాదు. తెలుగు సినిమాలు చేస్తారు, డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు. కానీ తెలుగు మాట్లాడటం, ఉచ్చరించడం మాత్రం తెలియదు. ఒక తెలుగు హీరోగా నాకు ఇవన్నీ ఆవేదన కలిగించాయి. మన భాషా, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతాం" -పవన్ కల్యాణ్, జనసేన అధ్యకుడు

Last Updated : Dec 2, 2019, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details