తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేనల్లుడితో పవన్​ కల్యాణ్ మల్టీస్టారర్.. ఆ సినిమా రీమేక్​ - పవన్ రీమేక్ మూవీస్

Pawan remake movie: మరో రీమేక్​కు పవన్ రెడీ అయ్యారు. ఈసారి మేనల్లుడితో కలిసి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

Pawan Kalyan- saidharam tej
పవన్ కల్యాణ్ సాయిధరమ్ తేజ్

By

Published : Feb 4, 2022, 5:34 AM IST

Pawan kalyan sai dharam tej remake: పవర్​స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే వెంకటేశ్​తో 'గోపాల గోపాల', రానాతో 'భీమ్లా నాయక్' చేశారు. ఇప్పుడు తన ఫ్యామిలీలో హీరో, మేనల్లుడు సాయిధరమ్​తో కలిసి తెర పంచుకునేందుకు సిద్ధమయ్యారు! ఈ విషయం దాదాపు ఖరారైంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.

తమిళంలో గతేడాది ఓటీటీలో విడుదలైన సినిమా 'వినోదయ సితమ్'. సముద్రఖని దర్శకత్వం వహించడం సహా కీలకపాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తెలుగులోనూ ఆయనే డైరెక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్​తో పవన్​ కల్యాణ్

పవన్ 'భీమ్లా నాయక్' రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్​తో పవర్​స్టార్ బిజీగా ఉన్నారు. దీని తర్వాత 'భవదీయుడు భగత్​సింగ్' చేస్తారు. మరోవైపు సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం ఓ మిస్టరీ థ్రిల్లర్​లో నటిస్తున్నారు. కార్తిక్ దండు దర్శకత్వం వహిస్తుండగా.. బీవీఎస్​ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details