తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జెండా పండగ రోజు పవన్​ 'భీమ్లా నాయక్' ఫస్ట్​ గ్లింప్స్ - పవన్ కల్యాణ్​ లేటెస్ట్ న్యూస్

పవన్​ కొత్త సినిమా టైటిల్​తో పాటు ఫస్ట్​ గ్లింప్స్​ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చెప్పడం సహా ఓ పోస్టర్​ను రిలీజ్ చేశారు.

Pawan kalyan rana movie latest update
పవన్​ కల్యాణ్

By

Published : Aug 13, 2021, 4:13 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. అభిమానుల ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టైటిల్​తో పాటు ఫస్ట్​ గ్లింప్స్​ను ఆగస్టు 15 ఉదయం 9:45 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

పవన్​ కల్యాణ్

ఇందులో పవన్​ సరసన నిత్యా మేనన్ నటిస్తున్నారు. అతడిని ఢీకొట్టే పాత్రలో రానా పోషిస్తున్నారు. ఇతడికి జోడీగా ఐశ్వర్య రాజేశ్​ కనిపించనుంది.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్​గా దీనిని తెరకెక్కిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే, మాటలు అందిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ పతకాంపై నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details