తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీమ్లా నాయక్' షూటింగ్​లో పవన్, రానా.. ఫొటో వైరల్ - భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్​లో పవన్, రానా

పవన్ కల్యాణ్(pawan kalyan new movie), రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'(bheemla nayak new update). ఈ సినిమా షూటింగ్ స్పాట్​లోని ఓ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్రబృందం. ఇందులో పవన్, రానా విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు.

Bheemla Nayak
భీమ్లా నాయక్

By

Published : Oct 21, 2021, 3:32 PM IST

పవన్ కల్యాణ్(pawan kalyan new movie), రానా ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'(bheemla nayak new update). శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది చిత్రబృందం. ఆఖరి పైట్​కు సంబంధించిన సన్నివేశంలా కనిపిస్తున్న ఈ ఫొటో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్, రానా(rana daggubati movies) షూటింగ్ విరామంలో విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు.

మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'​కు రీమేక్​(ayyappanum koshiyum telugu remake)గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్​ప్లే అందిస్తున్నారు. ఇందులో పవన్(pawan kalyan new movie) భార్యంగా నిత్యామేనన్ కనిపించబోతుండగా.. రానా సరసన ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న(bheemla nayak release date) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి: డైరెక్టర్ శంకర్ అల్లుడిపై పోక్సో కేసు

ABOUT THE AUTHOR

...view details