తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్​స్టార్​తో సురేందర్ రెడ్డి సినిమా ఫిక్స్.. జోష్​లో ఫ్యాన్స్ - పవన్ కల్యాణ్ కొత్త చిత్రం

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న పవర్​స్టార్ పవన్ కల్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం.

Pawan kalyan
పవర్​స్టార్

By

Published : Sep 2, 2021, 2:23 PM IST

వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్​స్టార్ పవన్​కల్యాణ్ మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ మూవీకి సురేందర్​ రెడ్డి దర్శకత్వం వహించబోతుండగా.. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. వక్కంతం వంశీ కథనందించారు.

ప్రస్తుతం భీమ్లా నాయక్​తో పాటు క్రిష్ తెరకెక్కిస్తోన్న హరిహర వీరమల్లులో నటిస్తున్నారు పవన్. 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ హరీశ్ శంకర్​తోనూ మరోసారి కలిసి పనిచేయనున్నారు. ఈ మూడు పూర్తయిన తర్వాతే సురేందర్ రెడ్డి ప్రాజెక్టు షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.

ఇవీ చూడండి

Pawankalyan Birthday: 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారు

'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది!

ABOUT THE AUTHOR

...view details