బండ్ల గణేశ్ ఈ పేరు చిత్రసీమలో అందరికీ సుపరిచితమే. నటుడిగా, నిర్మాతగా గుర్తింపు పొందిన ఈయన ఈరోజు ఉదయం తన భవిష్యత్తు గురించి ఓ అద్భుత వార్తను చెబుతానని ట్వీట్ చేశారు. అనుకున్నట్లుగానే సర్ప్రైజ్ ఇచ్చారు.
పవన్ హీరోగా బండ్ల గణేశ్ కొత్త చిత్రం! - పవన్ కల్యాణ్ బండ్ల గణేశ్
చాలా కాలం తర్వాత బండ్ల గణేశ్-పవన్ కల్యాణ్ కాంబోలో ఓ సినిమా రాబోతుందట. తాజాగా గణేశ్ చేసిన ఓ ట్వీట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.
"నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు.." అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు గణేశ్. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా బండ్ల గణేష్ నిర్మాతగా గతంలో 'తీన్‌మార్', 'గబ్బర్ సింగ్' చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు ఘన విజయాల్నే సాధించాయి. కొన్నాళ్లుగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని వేచి చూస్తున్నారు గణేశ్. అందేకేనేమో ఇప్పుడు 'నా దేవుడు మరోసారి నా కలలు నిజం చేశాడు' అంటూ గణేష్ ట్వీట్ చేశారు.
మొత్తంగా చాలా కాలం తరువాత మరోసారి పవన్- బండ్ల చిత్రం గురించి చిత్రసీమలో మరో సందడి మొదలైందని వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్త ఎలాంటిదో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే అంటున్నారు సినీ జనాలు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. 'వకీల్‌సాబ్'లోనూ నటిస్తున్నారు.