ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు హీరో పవన్ కల్యాణ్. అయితేఇటీవలేమళ్లీ సినిమాల్లో నటిస్తాడనే వార్తలు వినిపించాయి. బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌లో పవన్ హీరోగా చేస్తున్నట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. బోనీ కపూర్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. అయితే ఈ చిత్ర టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.
పవన్ కల్యాణ్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్..! - పవన్‌కల్యాణ్ కొత్త సినిమా లాయర్ సాబ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్
పవర్ స్టార్ కోసం 'లాయర్ సాబ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని, త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు. 'పింక్' చిత్రాన్ని ఇటీవలే తమిళంలో 'నెర్కొండ పార్వాయి' అనే టైటిల్‌తో అజిత్ హీరోగా రూపొందించారు. అక్కడ ఘన విజయం సాధించింది.
ఇది చదవండి: పవన్ కల్యాణ్ 'జార్జ్‌రెడ్డి' పాత్ర చేయాలనుకున్నారు!