పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాత. శతాబ్దాల కిందట జరిగే ఓ విభిన్నమైన కథాంశంతో.. చక్కటి పీరియాడికల్ డ్రామాగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. వచ్చే వారం నుంచి మరో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. దాదాపు పదిరోజుల పాటు సాగనున్న ఈ కొత్త షెడ్యూల్‌లో.. గండికోట సంస్థానం నేపథ్యంగా వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు పవన్‌పై చిత్రీకరించనున్నారని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ నేతృత్వంలో ఓ భారీ సంస్థానం సెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కొత్త సినిమా కోసం సంస్థానంలో పవన్ - pawan kalyan nidhi agarwal
క్రిష్ తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ భారీ సంస్థానం సెట్లో ప్రారంభం కానుంది. అనంతరం చార్మినార్ సెట్లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
కొత్త సినిమా కోసం సంస్థానంలో పవన్
17వ శతాబ్దం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దారని సమాచారం. ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ శివార్లలో చార్మినార్ సెట్ నిర్మిస్తున్నారు. దీన్ని మరో కొత్త షెడ్యూల్ కోసం సిద్ధం చేస్తున్నారట. త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ భామ జాక్వెలిన్ పెర్నాండెజ్ కీలక పాత్రలో కనువిందు చేయనుంది.
ఇది చదవండి:నిధి అగర్వాల్‌కు గుడి కట్టిన అభిమానులు