తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​ సినిమాల వార్తల్లో నిజమెంత..? - డైరెక్టర్​ క్రిష్​

పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్‌.. యువతలో విశేషమైన క్రేజ్‌ ఉన్న కథానాయకుడు. ఒక్క సన్నివేశంలో కనిపించినా.. గొంతు వినిపించినా థియేటర్లు ఈలలు, అరుపులతో దద్దరిల్లిపోతాయి. 'అజ్ఞాతవాసి' తర్వాత ఆయన నుంచి మరో చిత్రం రాలేదు. దీంతో పవన్‌ ఎప్పుడెప్పుడు సినిమాల్లో నటిస్తారా? అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు సమాధానం దొరికే తరుణం త్వరలోనే రాబోతోందని టాలీవుడ్​ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Pawan-kalyan-new-movie-Launched
పవన్​ సినిమాల వార్తల్లో నిజమేంత..?

By

Published : Jan 30, 2020, 6:23 AM IST

Updated : Feb 28, 2020, 11:38 AM IST

పవన్‌ కల్యాణ్‌ మళ్లీ వెండితెరపై నటిస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే ఆ కోరిక తీరనుంది. తాజాగా ఆయన 'పింక్‌' చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. షూటింగ్‌లో పాల్గొన్నారంటూ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొట్టాయి. అయితే, దీనిపై ఆ చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారంలేదు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ మాత్రం చకచకా జరిగిపోతోందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

తమన్​ సంగీతం, వేణు శ్రీరామ్​ దర్శకత్వం, దిల్​రాజు నిర్మాణంలో పింక్​ రీమేక్​

క్రిష్​ దర్శకత్వంలో..
తెలుగు చిత్ర పరిశ్రమలలో ఇతర దర్శకులతో పోలిస్తే విభిన్న కథనాలతో సినిమాలు తీసే క్రిష్.. పవన్‌కల్యాణ్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారట. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌ పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు, ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. బుధవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

స్వాతంత్ర్య సమరయోధుడిగా..
ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాయో లేదో తెలియదు కానీ, పవన్‌ మూడో సినిమా అంటూ మరో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. 'సైరా' లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి కథలో ఆయన నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. 'పండగసాయన్న' అనే స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథలో పవన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్‌. 'పింక్‌' రీమేక్‌, క్రిష్‌ చిత్రాల తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

అదుగో పవన్‌.. అంటే ఇదిగో సినిమా అన్నట్లు ప్రస్తుతం పవర్‌స్టార్‌ సినిమాలపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై పవన్‌కల్యాణ్‌ తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇందుకు కాలమే సమాధానం చెబుతుందేమో చూడాలి.

ఇదీ చూడండి..విజయ్​ దేవరకొండ 'సారూ మస్తుందీ నీ జోరు..'

Last Updated : Feb 28, 2020, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details