2018లో అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పూర్తిస్థాయి రాజకీయాలతో వెండితెరకు దూరమయ్యాడు పవర్‌స్టార్. రాజకీయాల్లో ఉన్నంత కాలం గుబురు గెడ్డం, మీసాలతో కనిపించాడు పవన్. దాదాపు రెండేళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్' రీమేక్‌తో పవన్‌కల్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో పవన్.. న్యాయవాది పాత్రలో నటిస్తాడని సమాచారం. వీటితో పాటు క్రిష్, హరీశ్ శంకర్ సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
మీసం మెలేసిన 'వకీల్ సాబ్'..
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ కార్యక్రమానికి గడ్డం లేకుండా గుబురు మీసాలు, ఒత్తైన జుట్టుతో హాజరయ్యాడు. రెండేళ్ల తర్వాత తమ అభిమాన నటుడిని హ్యాండ్సమ్ లుక్‌లో చూశామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.