అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 'భీమ్లానాయక్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'హరిహర వీరమల్లు' కొంతమేర షూటింగ్ పూర్తయింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేయనున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో డైరెక్టర్ చేరినట్లు తెలుస్తోంది. యాక్షన్ విత్ ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఓ కథను డైరెక్టర్ అనిల్ రావిపూడి పవన్‌కు వినిపించారట. కథ విన్న పవన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Pawan kalyan movies: యువ డైరెక్టర్‌తో పవన్ సినిమా - పవన్‌కల్యాణ్ మంచు మనోజ్
పవర్‌స్టార్ మరో యంగ్ డైరెక్టర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు! ప్రస్తుతం అతడు కథ వినిపించారు. అయితే అంగీకరించారా లేదా అనేది త్వరలో స్పష్టత రానుంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే?
అయితే, వరుస సినిమాలు ఉండటం వల్ల ఓకే చెప్పారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత రావచ్చు. అన్నీ ఓకే అయితే, దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్‌తో కలిసి 'వకీల్‌సాబ్' తీశారు.
నటుడు మంచు మనోజ్ గురువారం అగ్రకథానాయకుడు పవన్ కల్యాణ్‌ను కలిశారు. 'భీమ్లానాయక్' చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆ సినిమా సెట్‌లో పవన్‌ను కలిసిన మనోజ్ దాదాపు గంటసేపు ముచ్చటించారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. ఇద్దరూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలపైనే చర్చించుకుంటున్నట్లు సమాచారం.