ఈసారి సంక్రాంతి మూములుగా ఉండదు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోమవారం పవన్ చిత్రనిర్మాతల ప్రకటనతో ఈ లైనప్ ఖరారైంది.
భీమ్లానాయక్ ఫస్ట్ ఆగయా!
వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందడి, పవన్-రానా సినిమాతో మొదలుకానుంది. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయనున్నట్లు సోమవారం(ఆగస్టు 2) ప్రకటించారు. త్వరలో సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.