చాలా రోజుల తర్వాత పవర్ స్టార్, మెగాస్టార్ కలిశారు. వీరు కలిస్తే ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. అభిమానులకు కనుల పండగే. చిరంజీవి-పవన్ కల్యాణ్ కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఆయనతో పాటు పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఉన్నారు. భేటీకి కారణం తెలియకపోయినా.. అభిమానులు మాత్రం ఆనందిస్తున్నారు.