ఒకరు పవర్‌స్టార్(pawan kalyan news).. ఒకరు సూపర్‌స్టార్.. మరొకరు యంగ్ టైగర్.. ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే.. ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదూ!.. మరికొద్ది రోజుల్లో ఇది నిజం కాబోతుందని తెలుస్తోంది.
ఒకే ఫ్రేమ్‌లో పవన్, మహేశ్, తారక్.. నిజమెంత? - తారక్ మహేశ్ బాబు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR news) వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Kotiswarulu news). ఈ షోలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో తారక్, మహేశ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తారట. అదెలాగంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR news) వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Kotiswarulu news). మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడం సహా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్ షోలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (mahesh babu meelo evaru koteeswarudu date) సందడి చేశారు. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు ఫుల్ జోష్‌గా సమాధానాలు ఇచ్చారు. మరి పవన్ కల్యాణ్(pawan kalyan news) ఏం చేశారని మీ అనుమానమా?.. ఈ షోలో ఓ ప్రశ్నకు 'వీడియోకాల్ ఏ ఫ్రెండ్' లైఫ్‌లైన్‌ను ఎంచుకున్న మహేశ్.. ఆ సమయంలో పవన్‌కు ఫోన్ చేస్తారని సమాచారం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే ఒకే ఫ్రేములో ముగ్గురు స్టార్ హీరోలు కనిపించడం ఖాయం.
తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ గేమ్ షోలో ఇప్పటివరకు పలువురు స్టార్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వాళ్లందరూ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ప్రారంభ ఎపిసోడ్లో రామ్‌చరణ్ పాల్గొని అలరించారు. రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, తమన్, సమంతలు కూడా ఈ స్టేజ్‌పై తళుక్కున మెరిసి.. ఎన్టీఆర్ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో మహేశ్ ఎపిసోడ్ (Mahesh Babu NTR) ప్రసారం కానున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.