తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పండగ తర్వాతే సెట్స్​లోకి పవన్​ కల్యాణ్ - pawan anjali nivetha thomas

దసరా పండగ తర్వాతే, 'వకీల్​సాబ్' సెట్స్​లో హీరో పవన్​కల్యాణ్ అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం అంజలి, నివేదా థామస్​లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

pawan kalyan joins shooting of vakeelsaab after dussehra
పండగ తర్వాతే సెట్స్​లో పవన్​ కల్యాణ్

By

Published : Oct 15, 2020, 6:21 AM IST

కాస్త ఆలస్యమైనా అగ్ర కథానాయకులు ఒకొక్కరుగా చిత్రీకరణల కోసం రంగంలోకి దిగుతున్నారు. కరోనా ఉద్ధృతితో నిలిచిపోయిన సినిమాల్ని పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'వకీల్‌సాబ్‌' చిత్రీకరణ ఇప్పటికే తిరిగి ప్రారంభమైంది. ప్రధాన పాత్రలు పోషిస్తున్న అంజలి, నివేదా థామస్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా రంగంలోకి దిగే సమయం వచ్చింది. దసరా పండగ తర్వాత ఆయన బరిలోకి దిగనున్నారు.

ఈ నెల చివరి నుంచి పవన్‌ కల్యాణ్‌తోపాటు, శ్రుతిహాసన్‌లపై సన్నివేశాల్ని తీసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పవన్ న్యాయవాదిగా కనిపించనుండటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details